టీమిండియాకు వెస్టిండీస్‌ షాక్.. రెండో వన్డేలో ఓటమి

టీమిండియాకు వెస్టిండీస్‌ షాక్.. రెండో వన్డేలో ఓటమి

బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  తొలి వన్డేలో చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేదించడానికే నానా ఇబ్బందులుపడిన ఇండియా బ్యాటర్లు.. రెండో వన్డేలో ఘోరంగా తేలిపోయారు.   శనివారం జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియాపై కరీబియన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 40.5 ఓవర్లలో 181 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 55) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీతోకి తోడు, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34) రాణించగా,  మిగతా వారు విఫలమయ్యారు. ఈ మ్యాచ్​లో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీకి రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. హార్దిక్​ పాండ్యా కెప్టెన్​గా వ్యవహరించాడు. 

మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉండటంతో ఓపెనర్లు ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి ఆరంభాన్నిచ్చారు. కరీబియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ పోటీపడి ఆడారు. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ బౌండ్రీ రాబడుతూ స్కోరు బోర్డును కాపాడారు. ఈ క్రమంలో తొలి పది ఓవర్లలో ఈ ఇద్దరు 49 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగిన తర్వాత స్పిన్నర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగినా వీళ్ల ఆటలో మార్పు రాలేదు. 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోతీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూడముచ్చటైన సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 51 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోతీనే విడగొట్టాడు. ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టే ప్రయత్నంలో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 90 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపడంతో ఇండియా స్కోరు 95/2గా మారింది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9), అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1), హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా (7) ఫెయిలయ్యారు. ఎనిమిది ఓవర్ల వ్యవధిలో ఈ ముగ్గురు పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరడంతో ఇండియా స్కోరు 113/5గా మారింది. 

ఈ దశలో వర్షం రావడంతో ఆటను కాసేపు ఆపారు. తిరిగి ప్రారంభమైన తర్వాత సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24), జడేజా (10) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జోడించి జడేజా వెనుదిరిగాడు. మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత సూర్య కూడా మోతీకి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నాడు. . ఇక శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేదు. వర్షం వల్ల ఆటకు రెండోసారి అంతరాయం కలిగినా ఇండియా వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. శార్దూల్​తో పాటు ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6) వెంటవెంటనే పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరడంతో ఇండియా ఆలౌటైంది. విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో గుడకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోతీ, షెఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీశారు. కడపటి వార్తలు అందే సమయానికి ఛేజింగ్​లో విండీస్​ 8.2 ఓవర్లలో 53/1 స్కోరుతో నిలిచింది. 

అటు శాంసన్‌‌‌‌‌‌‌‌.. ఇటు శాంసన్

ఇండియా ఇన్నింగ్స్​లో 25వ ఓవర్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. రెండు ఎండ్లలో ఓకే పేరు, నంబర్‌‌‌‌‌‌‌‌ జెర్సీ (9)తో ఇద్దరు ప్లేయర్లు క్రీజులో కనిపించారు. ఈ ఇద్దరూ శాంసన్‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌. తొలి వన్డేలో సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌ జెర్సీతో బరిలోకి దిగిన సూర్య ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ అదే పని చేశాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శాంసన్‌‌‌‌‌‌‌‌ ఆడలేదు. కానీ, ఈ పోరులో ఇద్దరూ ఆడారు.  24వ ఓవర్ లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు పాండ్యా ఔటగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అప్పటికి  సంజు 9 రన్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడు.  అయితే, 25వ ఓవర్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే కరియా శాంసన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఈ ఇద్దరి పార్ట్​నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఒకే బాల్‌‌‌‌‌‌‌‌తో ముగిసింది. టీమ్​ కొత్త కిట్​లోని  జెర్సీ తనకు టైట్​గా ఉండటంతో సూర్య.. శాంసన్​ జెర్సీ వేసుకుంటున్నాడు.