మరో రికార్డ్ కు చేరువలో టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్

మరో రికార్డ్ కు చేరువలో టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్

టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్ మరో రికార్డుకు దగ్గరలో  ఉన్నారు. వన్డేల్లో రోహిత్, కోహ్లీ భాగస్వామ్యం ఇప్పటి వరకు 4906 పరుగులు చేసింది.  వెస్టిండీస్‌తో ఆదివారం ప్రారంభం కానున్న వన్డేలో  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగస్వామ్యం  మరో  94 పరుగులు చేస్తే  వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాన్ని సాధించిన జోడీల జాబితాలో ఎనిమిదో జోడీగా రికార్డ్ సృష్టిస్తారు.  ఈ జాబితాలో  టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ  176 ఇన్నింగ్స్‌లలో 47.55 సగటుతో 8227 పరుగులు చేశారు. రోహిత్, శిఖర ధావన్ జోడి 112 ఇన్నింగ్స్‌లలో 45.25 సగటుతో 5023 పరుగులు చేశారు. అయితే, విరాట్, రోహిత్ లు ఇప్పటివరకు కేవలం 81 ఇన్నింగ్స్‌లలో 64.55 పరుగుల అద్భుతమైన సగటుతో 4906 పరుగులు చేసి ఉన్నారు. శ్రీలంక నుంచి సంగక్కర మహేల జయవర్ధనే జోడీ 5992 పరుగులు,  తిలకరత్నే దిల్షాన్‌ భాగస్వామ్యంలో 5475 పరుగులు చేశారు.