ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం(జూలై 6) జింబాబ్వేతో జరిగే తొలి పోరులో యంగ్ టీమిండియా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. హరారే ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని కుర్రాళ్ళు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ సికందర్ రజా నాయకత్వంలోని జింబాబ్వే జట్టు స్వదేశంలో భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది.
ఐపీఎల్ సూపర్ స్టార్లు అభిషేక్ శర్మతో గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. నెంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తాడు. ఈ విషయాన్ని కెప్టెన్ గిల్ శుక్రవారం (జూలై 5) స్వయంగా చెప్పుకొచ్చాడు. రియాన్ పరాగ్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫార్మాట్‌లో కొద్దిగా సీనియరైనా శివందూబే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ మూడో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండనున్నారు.
జింబాబ్వేలోనూ వ్యక్తిగతంగా బాగా ఆడే ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ సికందర్ రజాకు ఈ ఫార్మాట్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. క్యాంప్‌బెల్, మదెవెరా, మురుమణి, మసకద్జా, ముజరబాని, జోంగ్వి, చతారాతో పాటుఈ మధ్య అంటుమ్ నఖ్వీ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న జట్టు అని అలసత్వం వహిస్తే టీమిండియాకే ప్రమాదం పొంచి ఉంటుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
మొబైల్స్ లో 5 టీ20 ల మ్యాచ్ సిరీస్ సోనీ లివ్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌లు టీవీలో సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్‌డి, సోనీ స్పోర్ట్స్ టెన్ 3, సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హెచ్‌డి, సోనీ స్పోర్ట్స్ టెన్ 4, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 హెచ్‌డి టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.
జట్లు (అంచనా)
ఇండియా:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ / జితేష్ శర్మ, సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే:
సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెనెట్, మురుమణి, జొనాథన్ క్యాంప్‌బెల్, అంటుమ్ నఖ్వీ, క్లైవ్ మదాండె, వెస్లీ మదెవెరా, ల్యూక్ జోంగ్వి, ఫరాజ్ అక్రమ్, మసకద్జా, ముజురుబాని.