భారత డ్రగ్స్ స్మగ్లర్‌ను అమెరికాలో చంపేశారు.. ఇది వాళ్ల పనేనంట..!

భారత డ్రగ్స్ స్మగ్లర్‌ను అమెరికాలో చంపేశారు.. ఇది వాళ్ల పనేనంట..!

అమెరికా, కాలిఫోర్నియాలో ఇండియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్‌ హత్యకు గురయ్యాడు. భారత్‌లో పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అతడిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మట్టుబెట్టింది. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ ఏరియాలో 6700 బ్లాక్‌లోని అతని ఇంట్లోనే లారెన్స్ షూటర్లు కాల్చి చంపారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకుంది.

బిష్ణోయ్ గ్యాంగ్ కదలికల గురించి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం వల్లే యాదవ్ హత్యకు గురయ్యాడని రోహిత్ గోదారా అనే ఫేస్‌బుక్ ఖాతా పోస్ట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా పంజాబ్ పోలీసు ఎన్‌కౌంటర్ సమయంలో గ్యాంగ్‌స్టర్ అంకిత్ భదు హత్యలో సునీల్ యాదవ్ ప్రమేయం ఉందని గోదారా, బిష్ణోయ్ గ్యాంగ్‌లు ఆరోపించాయి. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని పేర్కొంది. 

ALSO READ | హనియేను మేమే లేపేశాం: ఎట్టకేలకు ఒప్పుకున్న ఇజ్రాయెల్

పోలీసులతో కుమ్మక్కయ్యాడు.. 

"కాలిఫోర్నియాలో సునీల్ యాదవ్ (గోలీ) హత్యకు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ పూర్తి బాధ్యత వహిస్తున్నాం. అతను జిరాక్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అంకిత్ భదు ఉన్న ప్రదేశాన్ని పోలీసులతో పంచుకున్నాడు. పోలీసులతో కుమ్మక్కై మా సోదరుడు అంకిత్ భదు మరణానికి కారకుడయ్యాడు. అందుకు ప్రతీకారం తీర్చుకున్నాం. అంకిత్ భదు ఎన్‌కౌంటర్‌లో అతని ప్రమేయం వెల్లడి కావడంతో అతను అమెరికాకు పారిపోయాడు.."

చివరగా "మా శత్రువులందరికీ హెచ్చరిక.. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము మిమ్మల్ని చేరుకుంటాం.." అని బెదిరింపు సందేశంతో పోస్ట్ ముగించారు.\