శ్రీలంకలో ఉగ్ర దాడి: ఇండియా ముందేచెప్పినా పెడచెవిన పెట్టారు

ఇండియా ఎప్పుడూ తన ఇరుగుపొరుగు దేశాలు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటుంది. శ్రీలంకను తన మిత్రదేశంగా భావిస్తుంటుంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దాడులకు సంబంధించి శ్రీలంకను ఇండియా 10రోజుల క్రితమే హెచ్చరించింది. దాడులు జరిగే అవకాశాలున్నాయని ఇండియా నుంచి పక్కాగా సమాచారం అందినా, ఆ హెచ్చరికలను శ్రీలంక పెడచెవిన పెట్టింది. వాటిపై కనీసం శ్రద్ధ చూపలేదు. దాడుల నివారణకు ఎలాం టి చర్యలు తీసుకోలేదు. ఈ నెల మొదటివారంలోనే శ్రీలంక పోలీస్‌‌ చీఫ్‌‌కి ఇండియా పంపిన అలర్ట్‌‌ డాక్యుమెంట్‌‌ని కొన్నిన్యూస్‌‌ ఏజెన్సీలు ప్రచురించాయి. దానిలో చాలాస్పష్టం గా… శ్రీలంకలోని చర్చిలపైనా, ఇండియన్‌‌ హై కమిషనరేట్‌‌ పైనా దాడులు జరిగే అవకాశంముందని హెచ్చరించింది. అయినా పట్టించుకోనందుకు ఫలితం….టెర్రరిస్టులు మారణకాండకు తెగబడ్డారు. 290 మందికి పైగా అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారు.

జరగాల్సిన నష్టం జరిగిపోయాక… తీరిగ్గా శ్రీలంక ఇంటర్నేషనల్‌‌ క్రైసిస్‌‌ గ్రూప్‌‌ డైరెక్టర్‌‌ అలన్‌‌ కీనన్‌‌ స్పందించారు. ‘మాకు అలర్ట్‌‌ వచ్చిన మాట నిజమేగానీ, అదొక చిన్న గ్రూప్‌‌ కదా అనుకున్నాం. ఆడాక్యుమెంట్‌‌లో చెప్పిన సంస్థ (ఎన్‌‌టీజే)కి చెందిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నాం. అయితే, ఇంత పెద్ద దాడికి తెగబడుతుందని అనుకోలేదు’ అన్నారు. దాడులకు సంబంధించి పొరుగున మిత్ర దేశమైన ఇండియా నుంచి హెచ్చరికలు అందినప్పటికీ అక్కడి పోలీసు, ఇంటెలిజెన్స్‌‌ వర్గాలు ఎందుకు స్పందించలేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇండియా హెచ్చరించిన విషయాన్ని సాక్షాత్తూ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పా రు.

‘దాడులు జరగబోతున్నాయన్న పక్కాసమాచారం వచ్చినప్పటికీ వాటిని నివారించడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయమై విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని శ్రీలంక ప్రధానిచెప్పారు. శ్రీలంక ప్రధాని కామెంట్లతో ప్రెసిడెంట్ మైత్రీపాల సిరిసేన చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. దేశ సెక్యూరిటీ బలగాల కమాండర్‌‌గా చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ప్రెసిడెంట్ మైత్రీపాల సిరిసేనపైనే ఉంటుంది. శ్రీలంక రాజకీయాల్లో ప్రెసిడెంట్‌‌కి, ప్రైమ్ మినిస్టర్‌‌కి పొసగడం లేదు. సిరిసేన, విక్రమసింఘే మధ్య కిందటేడాది నుంచి కోల్డ్ వార్నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ సిరిసేన పార్లమెంటును రద్దు చేయడం, రాజపక్సేను కొత్త ప్రధానిగా నియమించడం చకచకా జరిగిపోయాయి. అయితే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మరలరణిల్ విక్రమసింఘే ప్రధాని అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఇప్పటికీ సఖ్యత లేదు. ఏమైనా హెచ్చరికలు అందినా, సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండర్‌‌గా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత మైత్రీపాల సిరిసేనపై ఉంది. ఇండియా హెచ్చరికలను శ్రీలంక ప్రభుత్వంలోని కొంత మంది కావాలనిపక్కకు పెట్టారన్న అనుమానాలు వస్తున్నాయి.

శ్రీలంక జనాభాలో ఎవరెంత శాతం?
శ్రీలంక జనాభాలో బుద్ధిస్టులదే మెజారిటీ వర్గం .మొత్తం జనాభాలో బుద్ధిస్టులు 70.2 శాతం ఉన్నారు. హిందువులు 12.6 శాతం , ముస్లిం లు9.7 శాతం ఉన్నారు. రోమన్ కేథలిక్ లు 6.1 శాతంఉన్నారు. మిగతా వారు ఇతర క్రిస్టియన్లు. శ్రీలంకలో బుద్ధిస్టులు, ముస్లిం లు, క్రిస్టియన్ల మధ్య కొం త-కాలంగా ట్రయాం గిల్ ఫైట్ నడుస్తోంది. ఆధిపత్యంకోసం ఈ మూడు వర్గాల మధ్య పోరు నడుస్తోంది.సామాన్య ప్రజలను మతం మార్చిన సంఘటనలుకూడా రికార్డ్ అయ్యాయి.