
ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ జట్ల మధ్య విజేత జట్టుకు ఇచ్చే పటౌడీ ట్రోఫీని రద్దు చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. జూన్‌లో నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌కు ప్రయాణించనుంది. ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ అని పేరు పెట్టకపోవచ్చు. ఈ ట్రోఫీకి ఏం పేరు పెట్టాలనే ఆలోచనలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రోఫీని ఎందుకు రద్దు చేయాలనే విషయంలో ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ రెండు దేశాల నుండి ఇటీవలి దిగ్గజాల పేర్లతో మరొక ట్రోఫీ పేరు పెట్టాలని ఈసీబీ భావిస్తోందట.
దిగ్గజ క్రికెటర్లు పేర్లు పెట్టాలని భావిస్తే ఈ ట్రోఫీకి సచిన్- అండర్సన్ అనే పేరు పెట్టే అవకాశాలు లేకపోలేదు. టెస్ట్ క్రికెట్ లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో అగ్ర స్థానంలో ఉన్నాడు. మరోవైపు అండర్సన్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్. ద్రవిడ్-కుక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు టాక్. ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది.
ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2007లో ఈ ట్రోఫీని ఆరంభించారు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు. 34.91 సగటుతో 2793 పరుగులు చేశాడు. వీటిలో ఆరు సెంచరీలు.. 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఆడిన 46 టెస్టుల్లో 40 టెస్ట్‌లు ఇండియా కెప్టెన్ గా చేసాడు. 1967లో న్యూజిలాండ్‌పై భారతదేశం తొలి విదేశీ టెస్ట్ విజయాన్ని సాధించింది. పటౌడీ మొత్తం 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
ఈ ట్రోఫీ 2007లో ప్రారంభమైంది. భారత్ తొలి ప్రయత్నంలోనే రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఇంగ్లాండ్ మూడు సార్లు ఈ ట్రోఫీ గెలిచింది. 2011, 2014, 2018లలో ఇంగ్లాండ్ పటౌడీ సిరీస్ ను కైవసం చేసుకుంది. తర్వాత 2022లో డ్రా అయినప్పటికీ ఇంగ్లాండ్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది.
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) April 1, 2025
The ECB is reportedly set to retire the 'Pataudi Trophy' ahead of the England-India Test series in June. 🇮🇳🏴🏏
A new trophy could be named after modern legends! 🏆 Who do you think deserves the honor? 🤔#Cricket #Test #ENGvIND #India pic.twitter.com/Eb2uv7ypQQ