టెర్రరిస్టులపై యుద్ధం మొదలుపెడుతున్నాం: ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెప్పిన మోదీ

టెర్రరిస్టులపై యుద్ధం మొదలుపెడుతున్నాం: ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెప్పిన మోదీ

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి టెర్రరిస్టును, వారికి మద్దతిచ్చే వారిని ఏ మూలన ఉన్నా వెతికి పట్టి శిక్షిస్తామని హెచ్చరించారు. బీహార్ లోని జరిగిన ఓ సభలో అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి మొదటి సారి ఇంగ్లీషులో మాట్లాడిన ప్రధాని మోదీ..టెర్రరిస్టులను భారతదేశం భూభాగం చివరి వరకు  వెంబడించి వేటాడుతామని ప్రతిజ్ణ చేశారు. టెర్రరిస్టుదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగాలని దేశం మొత్తం ముక్తకంఠంతో ఉందని ప్రధాని అన్నారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాతో ఉన్నారు. మాతో నిలిచిన ప్రజలకు, ప్రపంచ దేశాల నేతలకు నా కృతజ్ణతలు అని అన్నారు.

ప్రధాని మోదీ మొదటి సారి ఇంగ్లీషులో మాట్లాడటం సోషల్ మీడియాలో నెటిజన్లు హైలైట్ చేశారు. మోదీ ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా అంతర్జాతీయ లాబీతో పాటు ఉగ్రవాదులను స్పాన్సర్ చేస్తున్న వారికి ప్రత్యక్ష్ సందేశం అని అంటున్నారు. ఉగ్రవాదానికి, దానిని ప్రోత్సహిస్తున్న వారికి ఇది గట్టి హెచ్చరిక అని ప్రతికార చర్యలు గట్టిగానే ఉంటాయని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : జమ్మూకాశ్మీర్ టూరిస్టు స్పాట్లకు స్పెషల్ సెక్యూరిటీ

పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. భారతదేశంతో సంఘీభావం తెలిపారు.పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ హేయమైన దాడికి పాల్పడిన వారిని న్యాయం ముందు నిలబెట్టేందుకు భారతదేశానికి ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు.