ఐదేండ్లలో తలసరి ఆదాయం డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. రూ.1.66 లక్షలు పెరుగుతుంది : నిర్మలా సీతారామన్

ఐదేండ్లలో తలసరి ఆదాయం డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. రూ.1.66 లక్షలు పెరుగుతుంది : నిర్మలా సీతారామన్
  • గత పదేళ్లలో తీసుకున్న సంస్కరణలే కారణం 
  • ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయని వెల్లడి 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు వచ్చే ఐదేళ్లలో మెరుగవుతాయని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  అన్నారు. గత పదేళ్లలో తీసుకున్న సంస్కరణల వలన తలసరి ఆదాయం రెండింతలు పెరుగుతుందని అంచనా వేశారు. కౌటిల్య ఎకనామిక్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఇండియా ఎకానమీ  పదో స్థానం నుంచి ఐదో స్థానానికి మెరుగుపడిందని గుర్తు చేశారు. ‘ దేశంలో తలసరి ఆదాయం  2,730 డాలర్లు చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది.  ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కల ప్రకారం, ఇంకో ఐదేళ్లలో మరో 2,000 డాలర్లు (రూ.1.66 లక్షలు) పెరగనుంది. రానున్న  దశాబ్ద కాలంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయి’ అని సీతారామన్ అంచనా వేశారు. 

యుద్ధాలు నెలకొన్న ప్రస్తుత కాలంలో  ఇండియాలోని 140 కోట్ల మంది (గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనాభాలో 18 శాతం) ప్రజల తలసరి ఆదాయం కేవలం కొన్నేళ్లలోనే రెండింతలు పెంచాలని  ప్రభుత్వం చూస్తోంది. అసమానతలను తొలగించడం ద్వారా దీన్ని సాధించొచ్చు.  ‘రూరల్ ఇండియాకు సంబంధించి జీనీ కోఎఫీషియెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆదాయ అసమానతలను తెలిపే బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 0.283 నుంచి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0.266 కి దిగొచ్చింది. పట్టణాలకు సంబంధించి 0.363 నుంచి 0.314 కి తగ్గింది’ అని సీతారామన్ అన్నారు. గత పదేళ్లుగా తీసుకుంటున్న సంస్కరణల వలన అసమానతలు మరింత తగ్గుతాయని ధీమా వ్యక్తం చేశారు.  

వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయి: మోదీ

ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగేందుకు మార్పులు మొదలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన  కౌటిల్య ఎకనామిక్ కాన్‌‌‌‌క్లేవక్‌‌‌‌లో శుక్రవారం పాల్గొన్నారు.  2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని,  జాబ్స్‌‌‌‌, స్కిల్స్‌‌‌‌,  సస్టయినబుల్ గ్రోత్‌‌‌‌, వేగంగా వృద్ధి చెందడంపై మోదీ 3.0 లో ఫోకస్ పెట్టిందన్నారు. ఇండియా శకం మొదలయ్యిందని, ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌లో ఉన్నామని వివరించారు. 

టూవీలర్లు, ట్రాక్టర్ల తయారీలో టాప్‌‌‌‌ పొజిషన్‌‌‌‌లో ఉన్నామని,  మొబైల్‌‌‌‌ ఫోన్ల తయారీలో సెకెండ్ ప్లేస్‌‌‌‌లో ఉన్నామని గుర్తు చేశారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.   బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని, జీఎస్‌‌‌‌టీ, దివాలా చట్టం తీసుకొచ్చామని, డిఫెన్స్‌‌‌‌, మైనింగ్ సెక్టార్లలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పించామని,  ఎఫ్‌‌‌‌డీఐలను ఆకర్షించేందుకు రూల్స్ సులభతరం చేశామని వివరించారు.