బ్లోమ్‌ఫౌంటెయిన్: అండర్–19 వరల్డ్ కప్‌లో యంగ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలను సాధించింది. అర్షిన్ కులకర్ణి (108), ముషీర్ ఖాన్ (73) చెలరేగడంతో ఆదివారం జరిగిన గ్రూప్–ఎ మూడో లీగ్ మ్యాచ్‌లో ఇండియా 201 రన్స్ భారీ తేడాతో అమెరికాను ఓడించింది. టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 326/5 స్కోరు చేసింది. కెప్టెన్ ఉదయ్ సహారన్ (35), ప్రియాన్షు మోలియా (27 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
అతీంద్ర సుబ్రమణ్యం 2 వికెట్లు తీశాడు. తర్వాత అమెరికా 50 ఓవర్లలో 125/8 స్కోరుకే పరిమితమైంది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ (40) టాప్ స్కోరర్. అమోఘ్ ఆరేపల్లి (27), ఆరిన్ నాదకర్ణి (20) పోరాడి విఫలమయ్యారు. నమన్ తివారీ 4 వికెట్లు పడగొట్టాడు. అర్షిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.