
న్యూఢిల్లీ : డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌లో ఇండియా బోణీ చేసింది. శనివారం టోగోతో జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి 2–0 ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్ 6–2, 6–1తో లోయివా ఎయైటె అజవోన్‌పై నెగ్గాడు. గంటా 15 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు.
బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో పాటు పదునైన సర్వీస్‌లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఇక రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 6–0, 6–2తో టోగో నంబర్‌వన్ ప్లేయర్ థామస్ సెటోడ్జిపై నెగ్గాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.