IND vs ZIM 2024: జైశ్వాల్ తడాఖా.. తొలి బంతికే 13 పరుగులు

IND vs ZIM 2024: జైశ్వాల్ తడాఖా.. తొలి బంతికే 13 పరుగులు

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తొలి బంతికే 13 పరుగులు రాబట్టింది. ఒక్క బంతికి 13 పరుగులు అంటే ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నిజం. ఈ సిరీస్ లో భారత్ తొలి సారి ఓడిపోయింది. టాస్ గెలిచిన ఆతిధ్య జింబాబ్వే జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఓవర్ లోనే  బౌలింగ్ కు ఆశ్చర్యకరంగా కెప్టెన్ సికిందర్ రాజా వచ్చాడు. 

ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతిని జైశ్వాల్ సిక్సర్ గా మలిచాడు. బంతి హై ఫుల్ టాస్ కావడంతో అంపైర్ ఈ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ గా వచ్చిన బంతిని జైస్వాల్ మరోసారి స్టాండ్స్ లోకి తరలించాడు. దీంతో ఒక్క బంతికే భారత్ ఖాతాలో 13 పరుగులు వచ్చి చేరాయి. అయితే ఈ ఓవర్ నాలుగో బంతికి రాజా ఒక అద్భుతమైన బంతి వేసి జైశ్వాల్ ను బౌల్డ్ చేశాడు. మొదటి బంతికి రెండు సిక్సర్లు సమర్పించుకున్నా వికెట్ తీసి రాజా రివెంజ్ తీర్చుకున్నాడు.
 
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్(12), గిల్(13), అభిషేక్ శర్మ(14) విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో సంజు శాంసన్(19) పరాగ్(14) ఉన్నారు.