ముంబై: ఇసీ వాంగ్ (28 నాటౌట్, 2/18) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో.. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో ఇంగ్లండ్ విమెన్స్–ఎ టీమ్ 2 వికెట్ల తేడాతో ఇండియా విమెన్స్–ఎ జట్టుపై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఇండియా 19.2 ఓవర్లలో 101 రన్స్‌కు ఆలౌటైంది. ఉమా చెత్రి (21), దిశా కసాట్ (20) మినహా అందరూ విఫలమయ్యారు.
ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 104/8 స్కోరు చేసి గెలిచింది. వాంగ్‌కు తోడుగా కెప్టెన్ హోలీ అర్మిటగే (27), సెరెన్ స్మాలీ (18) రాణించారు. మిన్ను మణి, శ్రేయాంక పాటిల్ చెరో రెండు వికెట్లు తీసినా ప్రయోజనం లేకపోయింది. వాంగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.