- ఉ. 11 నుంచి స్పోర్ట్స్ 18లో లైవ్
రాజ్‌కోట్: బ్యాటింగ్, బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపుతున్న ఇండియా విమెన్స్ టీమ్ మరో సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తొలి వన్డేలో నిరాశపర్చిన ఫీల్డింగ్‌పై ఈ మ్యాచ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టనుంది. కెప్టెన్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండగా యంగ్ ప్లేయర్లు ప్రతీకా రావల్, తేజల్ బ్యాటింగ్ ఇండియా బలాన్ని పెంచింది. తొలి మ్యాచ్‌లో ఛేజింగ్‌లో ఈ ఇద్దరు కలిసి వంద రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. దాంsఓ హర్మన్‌ప్రీత్ కౌర్ లేని లోటును భర్తీ చేసినట్టయింది.
అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో ఇండియా కొద్దిగా మెరుగుపడాల్సి ఉంది. ఆరంభంలో టిటాస్ సాధు, సయాలీ ఆకట్టుకున్నా సైమా ఠాకూర్ వికెట్లు తీయడంలో ఫెయిలైంది. స్పిన్నర్ ప్రియా మిశ్రా, వైస్ కెప్టెన్ దీప్తి శర్మ ఫర్వాలేదనిపించినా తమ మార్కు ఆటను చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బౌలర్లందరూ తమ శక్తి మేరకు రాణించాల్సిన అవసరం చాలా ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్క సరి చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.