చెలరేగిన ఆశా శోభన, మంధాన.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

 చెలరేగిన ఆశా శోభన, మంధాన..  దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 2024, జూన్ 16వ తేదీ ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన  తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్టుతో భారత ఉమెన్స్ జట్టు తలపడింది.ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేన143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత హర్మన్‌ప్రీత్‌ సేన మొదట బ్యాటింగ్ చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (117) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆ తర్వాత షఫాలీ వర్మ (7), హేమలత (12), హర్మన్‌ప్రీత్‌ (10), జెమీమా రోడ్రిగ్స్‌ (17), రిచా ఘోష్‌(3)లు ఘోరంగా విఫలమయ్యారు. అయితే.. చివర్లో దీప్తి శర్మ (37), పుజా వస్త్రాకర్(31)లు రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది.

అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో కేవలం122 పరుగులకే కుప్పకూలింది. మారిజానే కాప్ (24), తజ్మిన్ బ్రిట్స్ (18), సునే లూస్ (33), సినాలో జాఫ్తా (27 నాటౌట్) భారీ స్కోరు చేయడంలో నిరాశపర్చారు. భారత బౌలర్లలో ఆశా శోభన అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో సత్తాచాటింది. దీప్తి శర్మ 2, రేణుకా సింగ్, పుజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌,  తలో వికెట్ పడగొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది.