INDW vs SAW: 90 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత మహిళలు

INDW vs SAW: 90 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత మహిళలు

చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళలు చరిత్ర సృష్టించారు. 90 ఏళ్ల మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో మరే ఇతర మహిళా జట్టు సాధించలేని రికార్డు నెలకొల్పారు. 600 పైచిలుకు పరుగులు చేసి మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు సాధించిన జట్టుగా అవతరించారు. 

తొలి ఇన్నింగ్స్‌లో విమెన్ ఇన్ బ్లూ 603/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ(205), స్మృతి మంధాన(149), జెమీమా రోడ్రిగ్స్(55), హర్మన్‌ప్రీత్ కౌర్(69), రిచా ఘోష్(86) పరుగులు చేశారు.

గతంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ మహిళలు 575/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.

మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరు:

  • 1. భారత్: 604/6d vs దక్షిణాఫ్రికా 2024లో
  • 2. ఆస్ట్రేలియా: 575/9d vs దక్షిణాఫ్రికా 2024లో
  • 3. ఆస్ట్రేలియా: 569/6d vs ఇంగ్లండ్ 1998లో
  • 4. ఆస్ట్రేలియా: 525 vs 1984లో భారత్
  • 5. న్యూజిలాండ్: 517/8 vs ఇంగ్లండ్ 1996లో