న్యూఢిల్లీ : విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా టీమ్‌ను ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ యాస్తికా భాటియా, స్పిన్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు.
అయితే వీళ్లు ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి జరిగే ఈ మెగా టోర్నీని బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలించారు. గ్రూప్–ఎలో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉంది.
జట్టు : హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సాజన సాజీవన్.