- శుభా, జెమీమా, యస్తికా, దీప్తి ఫిఫ్టీలు
- ఇండియా 410/7
- ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
నవీ ముంబై: అరంగేట్రం బ్యాటర్ శుభా సతీష్ (69), ఫస్ట్ టైమ్ టెస్టు మ్యాచ్ బరిలో నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ (68)కు తోడు యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (60 బ్యాటింగ్) ఫిఫ్టీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో ఇండియా విమెన్స్ టీమ్ శుభారంభం చేసింది. గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య జట్టు తొలి రోజే 94 ఓవర్లలో 410/7 స్కోరు చేసి బలమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (17), షెఫాలీ వర్మ (19) ఫెయిలైనా తర్వాతి ప్లేయర్లంతా సత్తా చాటారు. కెప్టెన్ హర్మన్ (49), స్నేహ్ రాణా (30) కూడా మెప్పించారు. ప్రస్తుతం దీప్తితో పూజా వస్త్రాకర్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉంది. ఆసీస్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, కేట్ క్రాస్, సివర్ బ్రంట్, చార్లీ డీన్, ఎకిల్‌స్టోన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆట అదుర్స్
డీవై పాటిల్ స్టేడియంలో ఫ్లాట్ వికెట్‌ను ఇండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఓవర్‌కు ఐదు రన్ రేట్‌తో వన్డే మ్యాచ్ స్పీడులో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు స్మృతి, షెఫాలీ తొలి పది ఓవర్లోనే పెవిలియన్ చేరినా ఇండియా తడబడలేదు. శుభా, 113 వైట్ బాల్ మ్యాచ్‌ల తర్వాత టెస్టు అరంగేట్రం చేసిన జెమీమా 115 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మూడో వికెట్‌కు ఇది రెండో బెస్ట్ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.
ముఖ్యంగా 24 ఏండ్ల శుభా అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకుంది. స్వేచ్ఛగా ఆడుతూ 13 బౌండ్రీలు కొట్టిన ఆమె అరంగేట్రం మ్యాచ్‌లోనే ఫిఫ్టీ (49 బాల్స్‌లో) చేసిన ఇండియా 12వ బ్యాటర్‌గా నిలిచింది. మరో ఎండ్‌లో జెమీమా సైతం ఈ ఫార్మాట్‌లో తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకుంది. ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా కెప్టెన్ హర్మన్, మరో యంగ్‌స్టర్ యస్తికా భాటియా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
15 రన్స్ వద్ద లారెన్ తన క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన యస్తికా ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకొని హాఫ్ సెంచరీ చేసింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 116 రన్స్ జోడించడంతో స్కోరు 300 దాటింది. ఫిఫ్టీ ముంగిట హర్మన్ నిర్లక్ష్యంగా రనౌట్ అయింది. కాసేపటికే భాటియాను చార్లీ డీన్ ఔట్ చేసింది. ఆ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బాధ్యత తీసుకుంది. స్నేహ్ రాణా (30) సపోర్ట్‌తో స్కోరు 400 దాటించింది. చివర్లో రాణాను సివర్ బ్రంట్ బౌల్డ్ చేయగా.. వస్త్రాకర్‌తో దీప్తి మరో వికెట్ పడకుండా రోజు ముగించింది.
సొంతగడ్డపై టెస్టుల్లో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. 2014లో సౌతాఫ్రికాపై చేసిన 400/6 స్కోరు రికార్డును బ్రేక్ చేసింది.
టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజు అత్యధిక స్కోరు చేసిన రెండో జట్టుగా ఇండియా. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తొలి రోజు 431/4 స్కోరు చేసింది.