- 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా
ముంబై: ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను బెంబేలెత్తించిన ఇండియా విమెన్స్ టీమ్.. వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో జెమీమా రొడ్రిగ్స్ (77 బాల్స్‌లో 7 ఫోర్లతో 82), పూజా వస్త్రాకర్ (46 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్), యాస్తికా భాటియా (64 బాల్స్‌లో 7 ఫోర్లతో 49) చెలరేగినా.. బౌలింగ్ వైఫల్యంతో.. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 లీడ్‌లో నిలిచారు.
టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 282/8 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (1), హర్మన్‌ప్రీత్ (9), స్నేహ్ రాణా (1) విఫలమైనా, రిచా ఘోష్ (21), దీప్తి శర్మ (21), అమన్‌జ్యోత్ కౌర్ (20) కాసేపు పోరాడారు. గార్డెనర్, వారెహమ్ చెరో రెండు వికెట్లు తీశారు. టార్గెట్ ఛేజింగ్‌లో ఆసీస్ 46.3 ఓవర్లలో 285/4 స్కోరు చేసి గెలిచింది. ఇన్నింగ్స్ థర్డ్ బాల్‌కు కెప్టెన్ అలీసా హీలీ (0) డకౌటైనా, ఫోబీ లిచ్‌ఫీల్డ్ (89 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 78), ఎలీసా పెర్రీ (72 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75) దంచికొట్టారు.
ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 148 రన్స్ జోడించి గెలుపు బాటలు వేశారు. 22 రన్స్ తేడాలో ఈ ఇద్దరూ వెనుదిరిగినా.. బెత్ మూనీ (42), తహ్లియా మెక్‌గ్రాత్ (68 నాటౌట్) చెలరేగిపోయారు. నాలుగో వికెట్‌కు 88 రన్స్ జత చేసి టీమ్‌ను గెలిపించారు. లిచ్‌ఫీల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.