Women's U19 World Cup: మలేషియాను 31 పరుగులకే చిత్తు చేసిన భారత మహిళల జట్టు

Women's U19 World Cup: మలేషియాను 31 పరుగులకే చిత్తు చేసిన భారత మహిళల జట్టు

మలేషియా వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌‌లో ఆతిధ్య జట్టుకు భారత మహిళలు ఘోర పరాభవాన్ని మిగిల్చారు. గ్రూప్ ఏ లో భాగంగా మంగళవారం (జనవరి 21) జరిగిన మ్యాచ్ లో మలేషియా జట్టును భారత్ కేవలం 31 పరుగులకే ఆలౌట్ చేసింది. వికెట్ నష్టానికి 12 పరుగులు చేసిన మలేషియా ఆ తర్వాత తమ చివరి 9 వికెట్లను 19 పరుగులకే కోల్పోయింది. జట్టులో అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు. హుస్నా 5 పరుగులు చేసి టాప్ స్కోరర్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Also Read :- నేడు జొకోవిచ్, అల్కరాజ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్

వైష్ణవి శర్మ 5 వికెట్లతో చెలరేగింది. ఆయుషి శుక్లా 3 వికెట్లతో రాణించింది. 32 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 17 బంతుల్లోనే  వికెట్ కోల్పోకుండా మ్యాచ్ ను ఫినిష్ చేసింది. బంతుల పరంగా  అండర్‌-19 ప్రపంచకప్‌‌లో భారత్ కు ఇదే అతి పెద్ద విజయం. గొంగడి త్రిష 12 బంతుల్లోనే 5 ఫోర్లతో 27 పరుగులు చేసి మ్యాచ్ కు త్వరగా ముగించింది. 5 వికెట్లు తీసిన వైష్ణవి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో ఆమె హ్యాట్రిక్ తీసుకోవడం హైలెట్ గా నిలిచింది.