Women's U19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌‌.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

Women's U19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌‌.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

అండర్‌-19 ప్రపంచకప్‌‌ ఓ భారత మహిళలు సత్తా చాటుతున్నారు. ఆదివారం(జనవరి 26) బంగ్లాదేశ్ పై సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ విధించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 7.1 ఓవర్లలో ఛేజ్ చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి మ్యాచ్ ను త్వరగా ముగించింది. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. భారత్ చివరి సూపర్ సిక్స్ లో భాగంగా తమ తర్వాత మ్యాచ్ మంగళవారం (జనవరి 28) స్కాట్లాండ్‌తో తలపడుతుంది. 

ALSO READ | Sophie Devine: క్రికెట్‌కు విరామం.. RCB స్టార్ ఓపెనర్ సంచలన నిర్ణయం

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. వైష్ణవి శర్మ మరోసారి విజృంభించి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. బంగ్లాదేశ్ టాప్ 5 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సుమయ్య అక్తేర్ 21 పరుగులు చేసి ఆ జట్టు పరువు కాపాడింది. వైష్ణవి శర్మకు ప్లేయర్  అవార్డు లభించింది.