అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. భారత క్రికెట్ అభిమానులను ఖుషీ చేస్తూ అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో తిరుగులేదని నిరూపించిన భారత మహిళలు.. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 2) సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులు చేయగా.. 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది.
ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న గొంగడి త్రిష ఫైనల్ లో 44 పరుగులు చేసి మ్యాచ్ ను త్వరగా ఫినిష్ చేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు అంచనాలను నిలబెట్టుకుంటూ నిక్కి ప్రసాద్ కెప్టెన్సీలోని టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ కు చేరే క్రమంలో ఇండియా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలవడం విశేషం.
ఆరంభం నుంచి దూకుడుగా:
లక్ష్యం 83 పరుగులే కావడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. తొలి రెండు ఓవర్లలోనే 18 పరుగులు రాబట్టింది. పవర్ ప్లే లో దూకుడుగా ఆడుతూ 44 పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్ లో బంతితో చెలరేగిన గొంగడి త్రిష బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించింది. నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాది ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. సైనిక (26) సహకారంతో మ్యాచ్ ను ఫినిష్ చేసి భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.
బెంబేలెత్తించిన భారత బౌలర్లు:
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఒకానొక దశలో సఫారీ జట్టు 44 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బౌండరీలు కాదు కదా.. పరగులు రావడమే కష్టంగా మారింది. ఆ సమయంలో వాన్ వూరస్ట్ (23), కౌలింగ్(15) జోడి ఒక్కో పరుగు జోడిస్తూ స్కోర్ బోర్డును 80 పరుగులు దాటించారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్ణవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు.
ALSO READ | Under 19 Womens T20 World Cup Final: బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. టార్గెట్ 83 పరుగులే
🇮🇳 𝐈𝐧𝐝𝐢𝐚 𝐔𝟏𝟗 𝐛𝐞𝐚𝐭 𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚 𝐔𝟏𝟗 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐅𝐢𝐧𝐚𝐥 🏆
— Female Cricket (@imfemalecricket) February 2, 2025
Gongadi Trisha's all-round contributions lead India to a massive 9-wicket win! 🙌#CricketTwitter #U19WorldCup pic.twitter.com/jeiwgV4Aif