IND vs IRE: పసికూనపై ప్రతాపం: ఐర్లాండ్‌పై టీమిండియా మహిళలు రికార్డుల వర్షం

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చూపిస్తూ ఏకంగా 304 పరుగులతో తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన(80 బంతుల్లో 135:12 ఫోర్లు, 7 సిక్సర్లు) ప్రతీక్ రావల్(129 బంతుల్లో 154: 20 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీలు కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. 

స్మృతి మందాన ఫాస్టెస్ట్ సెంచరీ 

ఈ మ్యాచ్ లో స్మృతి మందాన బ్యాటింగ్ లో చెలరేగి ఆడింది. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఆమె కేవలం 70 బంతుల్లోనే సెంచరీ చేసి భారత మహిళల వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. గత ఏడాది దక్షిణాఫ్రికాపై హర్మన్‌ప్రీత్ కౌర్ 87 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును మందాన బ్రేక్ చేసింది. వన్డే కెరీర్ లో ఆమెకు ఇది 10 వ సెంచరీ. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135 పరుగులు చేసింది. 

ALSO READ | SA20: 45 ఏళ్ళ వయసులో తాహిర్ డైవింగ్ క్యాచ్.. వైరల్‌గా మారిన రోనాల్డో సెలెబ్రేషన్

ప్రతీకా రావల్ ఆల్ టైం రికార్డ్:

భారత మహిళల జట్టులోకి ఓపెనర్ ప్రతీకా రావల్ దూసుకొస్తోంది. ఆమె ఆడిన తొలి ఆరు వన్డేల్లో ఏకంగా 444 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. ఓవరాల్ గా ఈ రికార్డ్ అంతకముందు నెదర్లాండ్స్‌కు చెందిన టామ్ కూపర్ పేరిట ఉంది. అతను 6 మ్యాచ్ ల్లో 392 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 154 పరుగులు చేసిన రావల్ వన్డేల్లో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా రికార్డులకెక్కింది. దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే 150 కి పైగా అత్యధిక వ్యక్తి గత స్కోర్ చేశారు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ తో 154 పరుగులు చేసింది. 

అత్యధిక పరుగులు, అతి పెద్ద విజయం 

ఈ మ్యాచ్ లో భారత్ 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకముందు అంతకముందు ఇదే సిరీస్ లో రెండో వన్డేలో 370 పరుగులు చేసిన రికార్డును ఆ తర్వాత మ్యాచ్ లోనే బ్రేక్ చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ పై 304 పరుగుల తేడాతో గెలిచి వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.