
సిల్హెట్: బంగ్లాదేశ్ టూర్‌లో ఇండియా విమెన్స్ క్రికెటర్లకు ఎదురేలేకుండా పోయింది. వరుసగా నాలుగో టీ20లోనూ బంగ్లాను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలో నిలిచారు. సోమవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఇండియా 56 రన్స్ (డక్‌వర్త్) తేడాతో గెలిచింది. 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత ఇండియా 122/6 స్కోరు చేసింది. హర్మన్ (38), రిచా (24), మంధాన (22), హేమలత (22) రాణించారు. తర్వాత బంగ్లా టార్గెట్‌ను 125 రన్స్‌గా లెక్కగట్టగా ఛేజింగ్‌లో ఆ టీమ్ 14 ఓవర్లలో 68/7 స్కోరు మాత్రమే చేసింది. దిలార అక్తర్ (21) టాప్ స్కోరర్. ఆశ శోభన, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది.