
ఢాకా : ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ నెల 28 నుంచి మే 9 వరకు జరిగే ఈ టూర్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 23న బంగ్లా చేరుకునే ఇండియా టీమ్ మే 10న అక్కడి నుంచి బయలుదేరుతుందని బంగ్లా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇందులో మూడు డే నైట్ (28, 30, మే 9) మ్యాచ్‌లు కాగా, మిగతా రెండు డే మ్యాచ్‌లు. అన్ని మ్యాచ్‌లు సిల్హెట్‌లో జరగనున్నాయి.