
భువనేశ్వర్: సొంతగడ్డపై ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో ఇండియా విమెన్స్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్‌లో 2–1 తేడాతో ఒలింపిక్ చాంపియన్స్, వరల్డ్ నం.1 నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది. డచ్ టీమ్‌తో తొలి పోరులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. డచ్ టీమ్‌లో పీన్ సాండర్స్ (17వ నిమిషం), ఫే వాండర్ (28వ ని).. ఇండియా నుంచి దీపిక (35వ ని), బల్జీత్ కౌర్ (43వ ని) తలో గోల్ కొట్టారు. షూటౌట్‌లో దీపిక, ముంతాజ్ ఖాన్ గోల్స్ చేయగా.. నెదర్లాండ్స్ నుంచి మర్జిన్ వీన్ మాత్రమే గోల్ కొట్టింది.
ఇండియా గోల్ కీపర్ సవితా పూనియా నాలుగు సేవ్స్ చేసి జట్టును గెలిపించింది. కాగా, టాప్ ర్యాంకర్ డచ్ టీమ్‌పై గెలిచిన విమెన్స్ టీమ్‌లోని ప్రతీ ప్లేయర్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) రూ. లక్ష ప్రైజ్‌మనీగా ప్రకటించింది. సపోర్ట్ స్టాఫ్‌లోని ఒక్కొక్కరికి రూ. 50 వేల నజరానా అందిస్తామని తెలిపింది. మరోవైపు మెన్స్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్‌తో సత్తా చాటడంతో ఇండియా 2–1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.