- మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18లో
అహ్మదాబాద్ : తొలి మ్యాచ్ గెలుపు జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్ అమ్మాయిలతో జరిగే ఆదివారం జరిగే రెండో వన్డేలోనూ గెలుపే లక్ష్యంగా ఇండియా విమెన్స్ టీమ్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో నూ గెలిచి సిరీస్ నెగ్గాలని ఆశిస్తోంది. అదే సమయంలో తమ బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాలని కోరుకుంటోంది. తొలి వన్డేలో ఇండియా 59 రన్స్ తేడాతో నెగ్గినా.. బ్యాటర్లు తమ 30, 40 రన్స్‌ను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
ఓపెనర్ స్మృతి మంధాన కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే, గాయం కారణంగా తమ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం అవ్వడంతో న్యూజిలాండ్ బలహీన పడింది.