ముంబై: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా విమెన్స్ టీమ్ రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే రెండో టీ20లో బలమైన ఇంగ్లిష్ టీమ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడ్డ టీమిండియా ఈ పోరులో గెలిచి లెక్క సరిచేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇది జరగాలంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ ఇండియా రాణించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో పిచ్ హోమ్ టీమ్ బౌలింగ్‌కు పెద్దగా సహకరించలేదు. కనికా అహుజాతో కలిపి నలుగురు స్పిన్నర్లను బరిలోకి దించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.
ఇంగ్లిష్ బ్యాటర్లు చివరి12 ఓవర్లలో 121 రన్స్ చేసి భారీ టార్గెట్‌ను నిర్దేశించారు. దీంతో ఈ మ్యాచ్‌లో అలాంటి పరిస్థితి తీసుకురావద్దని పక్కా ప్లాన్స్ వేస్తున్నారు. అరంగేట్రం స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ కోటా పూర్తి చేసినా వికెట్లు తీయకపోవడం ప్రతికూలాంశంగా మారింది. స్పిన్నర్లు ఎక్కువగా షార్ట్, ఫుల్ టాస్ బాల్స్ వేయడంతో ఫీల్డర్లు కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సివర్, వ్యాట్ క్యాచ్‌లను డ్రాప్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. పేసర్లలో రేణుకా సింగ్ ఫర్వాలేదనిపించినా పూజా వస్త్రాకర్ వికెట్లు తీయలేకపోవడం భారంగా మారింది. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే స్టార్ ప్లేయర్లు దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. చివర్లో రిచా ఘోష్, కనికా అహుజాబ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లో ఇండియా మెరుగుపడితేనే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు పోటీ ఇవ్వొచ్చు. కాగా, ఈ మ్యాచ్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు వందో టీ20 కావడం విశేషం.
సివర్, వ్యాట్‌పైనే ఫోకస్
ఇండియాతో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం సాధించిన ఇంగ్లండ్ టీమ్ దాన్ని కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఫైనల్ ఎలెవన్‌లో మార్పులు చేయడం లేదు. డ్యానీ వ్యాట్, సివర్ బ్రంట్ మంచి ఫామ్‌లో ఉండటం ఇంగ్లండ్‌కు అతిపెద్ద బలంగా మారింది. అయితే ఓపెనింగ్‌లో సోఫియా డంక్లే, క్యాప్సీ గాడిలో పడాల్సి ఉంది. మిడిలార్డర్‌లో కెప్టెన్ హీథర్ నైట్ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. అమీ జోన్స్, ఫ్రియా కెంప్ ఫినిషర్లుగా రాణిస్తుండటం శుభసూచకం. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ టాపార్డర్‌ను ఇండియా ఎంత తొందరగా ఔట్ చేస్తే ఆ టీమ్ స్కోరును అంత తక్కువకు కట్టడి చేయొచ్చు. ఇది జరగాలంటే ఇండియా బౌలర్లు శక్తికి మించి శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌కు తిరుగులేదు. ఎకిల్‌స్టోన్ మంచి ఫామ్‌లో ఉంది. బ్రంట్, క్యాంప్, సారా గ్లెన్ కూడా వీలైనప్పుడల్లా వికెట్లు తీసి మంచి సహకారం అందిస్తున్నారు. వీళ్లంతా కలిసికట్టుగా మరోసారి చెలరేగితే ఇండియాపై ఇంకో సిరీస్ గెలవడం పెద్ద కష్టం కాబోదు.