AUS vs IND: లేడీ సెహ్వాగ్ లేకుండానే.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షఫాలీపై వేటు

AUS vs IND: లేడీ సెహ్వాగ్ లేకుండానే.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షఫాలీపై వేటు

టీమిండియా యువ ఓపెనర్, పవర్ ఫుల్ హిట్టర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆస్ట్రేలియా టూర్ కు ఆమెను ఎంపిక చేయకుండా.. వేటు వేశారు. వరల్డ్ కప్ ముందు షెఫాలీకి ఇలా జరగడంతో ఆమె ఈ మెగా ఈవెంట్ లో అయినా చోటు దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మృతి మందనతో ఓపెనింగ్ కు దిగి భారత్ కు మంచి ఆరంభాలు ఇచ్చే ఈ యువ ఓపెనర్ గత కొద్దికాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతుంది. వన్డేల్లో షెఫాలీ సగటు కేవలం 23. ఈ కారణంగానే ఆమెను వన్డే స్క్వాడ్ నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. 

భారత క్రికెట్ లో లేడీ సెహ్వాగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో 56 పరుగులు మాత్రమే చేసింది. ఇక జట్టు విషయానికి వస్తే బీసీసీఐ మంగళవారం (నవంబర్ 19) ఆస్ట్రేలియా పర్యటనకు మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ డిసెంబర్ 5 నుండి 11 వరకు బ్రిస్బేన్, పెర్త్‌లలో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధాన ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా ఉంటుంది. 

హర్లీన్ డియోల్, టిటాస్ సాధు తిరిగి భారత జట్టులో చోటు సంపాదించారు. డిసెంబరు 2023లో డియోల్ చివరిసారిగా వన్డే ఆడింది. సాధు గత సంవత్సరం వన్డే స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న అరంగేట్రం చేయలేకపోయింది. ఇటీవలే అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో భాగమైన ఉమా చెత్రీ, దయాళన్ హేమలత, శ్రేయాంక పాటిల్, సయాలీ సత్‌ఘరే జట్టు నుంచి తొలగించబడ్డారు. ప్రియా పునియా తిరిగి జట్టులోకి వచ్చింది.


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్