రిషబ్‌‌ ధనాధన్‌‌.. వామప్‌‌లో ఇండియా విక్టరీ

రిషబ్‌‌ ధనాధన్‌‌.. వామప్‌‌లో ఇండియా విక్టరీ

న్యూయార్క్‌‌ : టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా బ్యాటింగ్‌‌లో అదరగొట్టింది. రిషబ్‌‌ పంత్‌‌ (53) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌కు హార్దిక్‌‌ పాండ్యా (40 నాటౌట్‌‌) అండగా నిలవడంతో.. శనివారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 60 రన్స్‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌పై నెగ్గింది. టాస్‌‌ గెలిచిన ఇండియా 182/5 స్కోరు చేసింది. రెండో ఓవర్‌‌లోనే శాంసన్‌‌ (1) ఔటైనా, రోహిత్‌‌ (23), రిషబ్‌‌ రెండో వికెట్‌‌కు 48 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. వన్‌‌డౌన్‌‌లో సూర్యకుమార్‌‌ (31) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. 7వ ఓవర్‌‌లో రోహిత్‌‌ ఔటైనా రిషబ్‌‌, సూర్య 11 ఓవర్లలోనే స్కోరు వంద దాటించారు. 

32 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన రిషబ్‌‌ను 12వ ఓవర్‌‌లో ఔట్‌‌ కావడంతో మూడో వికెట్‌‌కు 44 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఈ దశలో పాండ్యా నాలుగు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. సూర్య, శివం దూబే (14) వరుస విరామాల్లో వెనుదిరిగినా పాండ్యా నాటౌట్​గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాదేశ్‌‌ 20 ఓవర్లలో 122/9 స్కోరుకే పరిమితమైంది. మహ్మదుల్లా (40 రిటైర్డ్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. 

ఆరంభంలోనే అర్ష్‌‌దీప్‌‌ (2/12), హార్దిక్‌‌ (1/30) దెబ్బకు 41 రన్స్‌‌కే 5 వికెట్లు కోల్పోయింది. తన్జిద్‌‌ హసన్‌‌ (17), తౌహిద్‌‌ (13), సౌమ్య (0), లిటన్‌‌ దాస్‌‌ (6), నజ్ముల్‌‌ (0) నిరాశపర్చారు. షకీబ్‌‌ (28), మహ్మదుల్లా ఆరో వికెట్‌‌కు 75 రన్స్‌‌ జోడించినా ప్రయోజనం లేకపోయింది. బుమ్రా, సిరాజ్‌‌, అక్షర్‌‌  తలో వికెట్‌‌ తీశారు.