- దంచిన గైక్వాడ్, శాంసన్, రింకూ
- 2-0తో సిరీస్ సొంతం
మలాహిడే : షార్ట్ ఫార్మాట్‌లో ఇండియా యంగ్ జనరేషన్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ హీరోలు రుతురాజ్ గైక్వాడ్ (43 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 58), సంజు శాంసన్ (26 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40), రింకూ సింగ్ (21 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), శివం దూబే (16 బాల్స్‌లో 2 సిక్స్‌లతో 22 నాటౌట్) దంచికొట్టడంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇండియా 33 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.
దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 185/3 స్కోరు చేసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 152/8 స్కోరు చేసి ఓడింది. బాల్‌బిర్నీ (51 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72) టాప్ స్కోరర్. రింకూకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 బుధవారం జరుగుతుంది.
బ్యాటర్ల జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను ఐరీష్ బౌలర్లు దెబ్బకొట్టారు. దీంతో నాలుగో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (18) ఔట్‌కాగా, తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (1) వరుసగా రెండో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. ఐదు ఓవర్లలోపే ఈ ఇద్దరు పెవిలియన్‌కు చేరడంతో ఇండియా 34 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్, శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 11వ ఓవర్‌లో శాంసన్ 4, 4, 4, 6తో 18 రన్స్ దంచాడు. ఫలితంగా పవర్‌ప్లేలో 47/2తో ఉన్న స్కోరు 12 ఓవర్లలో100కు చేరింది. అయితే తర్వాతి ఓవర్‌లో వైట్ (1/33) బౌలింగ్‌లో షార్ట్ బాల్‌ను కట్ చేయబోయి శాంసన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
రింకూ సింగ్ నెమ్మదిగా ఆడినా, 15వ ఓవర్‌లో రుతురాజ్ 4, 6తో 39 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 16వ ఓవర్ ఫస్ట్ బాల్‌కే ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 24 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్సే వచ్చినా చివర్లో రింకూ రెచ్చిపోయాడు. 19వ ఓవర్‌లో 4, 6, 6తో 22 రన్స్ పించుకున్నాడు. లాస్ట్ ఓవర్లో దూబే 6, 6, 6తో 20 రన్స్ రాబట్టడంతో ఇండియా భారీ స్కోరు చేసింది. మెకార్తీ 2 వికెట్లు తీశాడు.
బాల్‌బిర్నీ ఒక్కడే..
టార్గెట్ ఛేజింగ్‌లో ఐర్లాండ్‌కు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్ బాల్‌బిర్నీ నిలకడగా ఆడినా.. మూడో ఓవర్‌లోనే ప్రసిధ్ కృష్ణ (2/29).. పాల్ స్టిర్లింగ్ (0), లోర్కాన్ టకర్ (0)ను ఔట్ చేశాడు. ఆరో ఓవర్‌లో రవి బిష్ణోయ్ (2/37) టర్నింగ్‌కు హ్యారీ టెక్టర్ (7) వికెట్ ఇచ్చుకున్నాడు. బాల్‌బిర్నీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. క్యాంఫర్ (18) నాలుగో వికెట్‌కు 35 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లేలో 31/3తో ఉన్న ఐర్లాండ్ ఫస్ట్ టెన్‌లో 63/4తో కష్టాల్లో నిలిచింది.
ఇక్కడి నుంచి బాల్‌బిర్నీ 6, 6, 4, 6, 6తో జోరందుకున్నాడు. మధ్యలో డాక్రెల్ (13) ఓ సిక్స్ కొట్టాడు. కానీ ఐదు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో మార్క్ అడైర్ (23) కాసేపు పోరాడినా మిగతా వారు బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. దాంతో ఐర్లాండ్ టార్గెట్‌కు చాలా దూరంలో ఆగిపోయింది.