ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేను బ్లాంక్ అయిపోయా..ఉత్కంఠ పోరును గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ

ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేను బ్లాంక్ అయిపోయా..ఉత్కంఠ పోరును గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: ఇండియాకు రెండోసారి టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ దిగ్గజాల జాబితాలో చేరాడు. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించిన ఇండియా 13 ఏండ్ల తర్వాత మరో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. ఆ మెగా ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల గురించి రోహిత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అత్యంత ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని, జట్టు విజయంలో అదే కీలక పాత్ర పోషించిందని అన్నాడు. 

ఇండియా ఇచ్చిన టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చెలరేగిపోతున్న వేళ సౌతాఫ్రికాకు  30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో తన మానసిక పరిస్థితి గురించి రోహిత్ వివరించాడు. ‘ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేను కంప్లీట్ బ్లాంక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా నేను ఎక్కువ దూరం ఆలోచించలేదు.  నా వరకు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని నేను చేయాల్సిన పనిపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఒక జట్టుగా  మేమంతా ప్రశాంతంగా ఉండి మా ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కాగా అమలు చేయడం అత్యంత కీలకం. 

సౌతాఫ్రికాకు 30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 రన్స్ అవసరం అయినప్పుడు మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అయినా మేం ఎంత ప్రశాంతంగా ఉన్నామో  చివరి ఐదు ఓవర్లలో మేం  బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసిన తీరును చూస్తే అర్థం అవుతుంది.  మేమంతా మా పనిపైనే ఫోకస్ పెట్టాం. అంతకుమించి మరే విషయం గురించి ఆలోచించలేదు. అలాంటి పరిస్థితిలోనూ ఆందోళన చెందకపోవడం మా జట్టు గొప్పతనం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.