IND vs ZIM 2024: చివరి టీ20 మనదే.. 4-1 తేడాతో సిరీస్ గెలిచిన భారత్

జింబాబ్వే పర్యటనను భారత యువ జట్టు విజయవంతంగా ముగించింది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆదివారం(జులై 14) జరిగిన టీ20లో టీమిండియా 42 పరుగులు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గెలిచిన గిల్ సేన నిర్ణీత ఓవర్లలో 167 పరుగులు చేయగా.. చేధనలో జింబాబ్వే 125 పరుగులకు ఆలౌటైంది.  

ALSO READ | IND vs ZIM 2024: జైశ్వాల్ తడాఖా.. తొలి బంతికే 13 పరుగులు

168 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ చెలరేగడంతో మాధవీర , బెన్నెట్ త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో మేయర్స్, మారుమాని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 44 పరుగులు జోడించిన తర్వాత  మారుమానిని సుందర్ వెనక్కి పంపాడు. ఇక్కడ నుంచి జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్య ఛేదనలో వెనక పడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 125 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. దూబే 2 వికెట్లు తీసుకోగా తుషార్ దేశ్ పాండే, సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. 

శాంసన్ ఒంటరి పోరాటం:              

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్‌ (58; 45 బంతుల్లో ఒక ఫోర, 4 సిక్స్ లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ తొలి ఓవర్లోనే(12) ఔటవ్వగా.. వన్ డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ (14) అతని వెంటే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ గిల్‌ (13) సైతం నిరాశ పరిచాడు. దాంతో, టీమిండియా ఐదు ఓవర్లలోపే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది.

ALSO READ | IND vs ZIM 2024: శాంసన్ ఒంటరి పోరాటం.. జింబాబ్వే ముందు సాధారణ లక్ష్యం

ఆ సమయంలో రియాన్‌ పరాగ్‌ (22)తో కలిసి శాంసన్‌ ఇన్నింగ్స్‌ను చక్కడిద్దాడు. చివర్లో శివం దూబే (26), రింకూ సింగ్‌ (11) దూకుడుగా ఆడటంతో భారత్‌ మంచి స్కోరే చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాణి 2 వికెట్లు పడగొట్టగా.. సికిందర్‌, రిచర్డ్‌, బ్రాండన్‌ తలో వికెట్‌ తీశారు.