IND vs BAN 2024: సూర్య, పాండ్య మెరుపులు.. తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

IND vs BAN 2024: సూర్య, పాండ్య మెరుపులు.. తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించి సిరీస్ లో బోణీ కొట్టారు. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.5  ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులుచేసి గెలిచింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9) జరుగుతుంది. 

128 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు మెరుపు ఆరంభం లభించింది. తొలి రెండు ఓవర్లలోనే భారత ఓపెనర్లు 25 పరుగులు రాబట్టారు. ఈ దశలో జోరు మీదున్న అభిషేక్ శర్మ 7 బంతుల్లోనే 16 పరుగులు చేసి రనౌటయ్యాడు. సంజు శాంసన్ తో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో భారత్ 71 పరుగులు చేసింది. స్వల్ప వ్యవధిలో సూర్య సంజు ఔటైనా.. హార్దిక్ పాండ్య (39: 16 బంతుల్లో 2 ఫోర్లు,5 సిక్సర్లు), నితీష్ కుమార్(20) మ్యాచ్ ను త్వరగా ముగించారు. సంజు శాంసన్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు.. సూర్య కుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. 

Also Read :- బంగ్లాపై టీమిండియా బౌలర్ల పంజా

 బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్ కు తలో వికెట్ లభించింది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులు చేసిన మెహదీ హసన్ మిరాజ్ టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్య, సుందర్ లకు తలో వికెట్ లభించింది.