‘మోత మోగింది’.. ఒక్క రోజే ఇండియాకు ఏడు పతకాలు

‘మోత మోగింది’.. ఒక్క రోజే ఇండియాకు ఏడు పతకాలు

పారిస్ పారాలింపిక్స్‌‎లో ఇండియా పతకాల మోత మోగించింది. ఒక్క రోజే  రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు సొంతం చేసుకుంది. స్టార్ జావెలిన్ త్రోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుమిత్ అంటిల్‌‌‌‌‌‌‌రికార్డు త్రో చేసి వరుసగా రెండో పారాలింపిక్స్‌‎లో గోల్డ్ నెగ్గాడు.  బ్యాడ్మింటన్‌‎లో ‌‌‌‌‌‌‌‌కుమార్ నితేశ్‌‌‌‌‌‌‌‌ స్వర్ణం గెలవగా.. సుహాస్, తులసిమతి,  డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియా రజతాలు అందుకున్నారు. మరో షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీషా, ఆర్చరీలో శీతల్ దేవి-రాకేశ్‌‌‌‌ కుమార్ కాంస్యాలులు రాబట్టారు. దాంతో 3 స్వర్ణాలు సహా 14 పతకాలతో ఇండియా15వ స్థానానికి చేరుకుంది. 

Also Read:-బ్యాడ్మింటన్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో  పతాకధారిగా ఇండియా జట్టును ముందుండి నడిపించిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌‌‌‌‌‌‌‌ తన ఆటతోనూ త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు.  తన పేరిటే ఉన్న పారాలింపిక్స్ రికార్డును బ్రేక్ చేస్తూ వరుసగా రెండో ఎడిషన్‌‎‌‌‌‌‌‌‌లో బంగారు పతకం గెలిచి ఔరా అనిపించాడు. సోమవారం జరిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌64 మెన్స్ జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రో ఫైనల్లో సుమిత్ బల్లెంను 70.59 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు.

 టోక్యో పారాలింపిక్స్‌‎లో స్వర్ణం నెగ్గే క్రమంలో 68.55 మీటర్లతో నెలకొల్పిన రికార్డును మూడు సార్లు బ్రేక్ చేశాడు. తొలి ప్రయత్నంలోనే అందరికంటే ఎక్కువగా 69.11 మీటర్ల దూరం విసిరిన సుమిత్‌.. రెండో ప్రయత్నంలో 70 మీటర్లను దాటాడు. ఇదే ఈవెంట్‌‎లో పోటీ పడ్డ సందీప్‌‌‌‌62.80తో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో కాంస్యం కోల్పోగా..  సంజయ్ సాగర్ 58.03 మీటర్లతో ఏడో ప్లేస్‌‌‎తో సరిపెట్టాడు. 

షట్లర్లకు నాలుగు
    
పారాలింపిక్స్‌‎‌‌లో ఇండియా షట్లర్లు  స్వర్ణం సహా నాలుగు మెడల్స్‌‌‌‌‌‌‌‌కైవసం చేసుకున్నారు.  మెన్స్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌3 సింగిల్స్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో టాప్ సీడ్ నితేశ్‌‌‌‌‌‌‌‌ 21–14, 18–21, 23–21తో రెండో సీడ్,  టోక్యో గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌డానియెల్ బెతెల్‌(బ్రిటన్‌‌‌‌‌‌‌‌)పై ఉత్కంఠ విజయం సాధించాడు. కాళ్ల వైకల్యం ఉన్న వారి కోసం నిర్వహించే ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌3 విభాగంలో సగం కోర్టులో మాత్రమే  షట్లర్లు పోటీపడతారు. నేవీ ఆఫీసర్ కొడుకైన కుమార్ రైలు ప్రమాదం కారణంగా 15 ఏండ్ల వయసులో ఎడమ కాలును కోల్పోయాడు. దేశ సైనికులు, క్రికెటర్ విరాట్ కోహ్లీ స్ఫూర్తితో పారా గేమ్స్‌‌‌‌లోకి వచ్చిన నితేశ్‌‌‌‌‌‌‌‌ బ్యాడ్మింటన్ రాకెట్‌‌‌‌తో అద్భుతాలు చేస్తున్నాడు.  ఆసియా, వరల్డ్ పారా గేమ్స్‌‌‎లో మెరిసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ అందుకున్న నితేశ్‌‌‌‌‌‌‌‌తన తొలి పారాలింపిక్స్‌‌‌‌లోనే  గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌తో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. 

సుహాస్‌‌‌‌‌‌‌, తులసిమతి సిల్వర్‌‎తో సరి‌‌‌‌‌‌‌‌

మెన్స్ సింగిల్స్‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌4 కేటగిరీలో వరుసగా రెండోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌చేరిన సుహాస్ యతిరాజ్‌‌‌‌‌సుహాస్ 9–21, 13–21తో లూకాస్‌‌‌‌‌‌‌‌మజుర్ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడిపోయాడు. అయినా వరుసగా రెండు ఒలింపిక్స్‌‎లో రజతాలు గెలిచిన తొలి షట్లర్‌‌‌‌‌‎గా నిలిచాడు.  విమెన్స్‌‌‌‌‌సింగిల్స్ ఎస్‌‌‌‌‌‌‌‌యూ5 ఫైనల్లో  తులసిమతి మురుగేశన్‌‌‌‌‌‌‌‌17–21, 10–21తో చైనా షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌యాంగ్ క్వియుగ్జియా చేతిలో ఓడి సిల్వర్ తెచ్చింది. కాంస్య పతక పోటీలో మనీషా 21–12, 21–8తో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌రోసెన్‌‌‌‌‌‌‌‌గ్రెన్‌‎ను చిత్తు చేసింది.  

ఖతర్నాక్ కతునియా

డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియా వరుసగా రెండో పారాలింపిక్స్‌‎‌‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఎఫ్‌‌‌‌‌‌‌‌56 ఈవెంట్ ఫైనల్లో యోగేశ్‌‌‌‌‌‌‌‌తన తొలి ప్రయత్నంలోనే  ఈ సీజన్‌‎లో  బెస్త్‌‌‌‌‌‌‌‌ 42.22 మీటర్ల త్రో చేసి రెండో స్థానంలో నిలిచాడు. 

శీతల్‌,‌‌‌‌‌‌‌-రాకేశ్‌‌‌‌‌‌‌‌కాంస్య గురి

వ్యక్తిగత విభాగాల్లో పతకాలు అందుకోలేకపోయిన ఇండియా టాప్ ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిక్స్‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్ కాంపౌండ్ విభాగంలో  కాంస్యం గెలిచారు. కాంస్య పతక ప్లే ఆఫ్​ మ్యాచ్‌‎‌లో టాప్ సీడ్ ఇండియా జోడీ 156–155తో  ఇటలీ జంట ఎలోనొరా–బొనాసినాపై ఉత్కంఠ విజయం సాధించింది.


 కుస్తీ నుంచి జావెలిన్‌‎కు మారి

హర్యానాలోని సోనెపట్‌‎కు చెందిన సుమిత్ అంటిల్ మొదట మంచి రెజ్లర్‌. ఇండియా లెజెండరీ రెజ్లర్‌‌‌‌‌యోగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌దత్‌‌‌‌‌‌‌‌స్ఫూర్తితో కుస్తీని కెరీర్‌గా ఎంచుకొని 17 ఏండ్ల వయసు వరకూ ఆ ఆటనే ప్రేమించాడు. ఏడేండ్ల వయసులోనే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఆఫీసర్ అయిన  తండ్రిని కోల్పోయిన  సుమిత్‌‌‌‌‌‌‌‌రెజ్లింగ్‌లో రాణించి ఆర్మీలో చేరాలని కల కన్నాడు. కానీ, 2015లో  బైక్ యాక్సిడెంట్‌‎లో కాలు పోగొట్టుకోవడంతో అతని రెజ్లింగ్‌ కెరీర్‌‌ హఠాత్తుగా ఆగిపోయింది. అయితే, తన గ్రామానికే చెందిన పారా అథ్లెట్ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సూచనతో పారా గేమ్స్‌‌‎లోకి రావాలని నిర్ణయించుకోవడం సుమిత్ జీవితానికి కొత్త దారి చూపింది. 


రెజ్లింగ్ మ్యాట్‌నుంచి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అంటిల్‌‌‌‌‌‌‌‌ జావెలిన్‌‎ను పట్టుకున్నాడు. అప్పటికే కుస్తీ ఆటతో పెంచుకున్న భుజ బలాన్ని జావెలిన్ విసరడంలో చూపించిన సుమిత్‌‎‌‌కు తిరుగులేకుండా పోయింది. ఏకంగా నాలుగుసార్లు వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన సుమిత్ ఇప్పుడు మూడు సార్లు పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌ గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ వరుసగా రెండో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. తన ఆటతో ఇప్పటికే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సుమిత్ తాజా విజయంతో మరింత ఎత్తుకు ఎదిగాడు.

ఫైనల్లో మన దీప్తి

మెగా గేమ్స్‌‌లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి విమెన్స్‌‌ టీ20 వంద మీటర్ల ఈవెంట్‌‌లో ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్‌‌ హీట్‌‌1లో పోటీ పడ్డ దీప్తి 55.45 సెకన్లతో టాప్‌‌ ప్లేస్, ఓవరాల్‌‌గా రెండో ప్లేస్‌‌తో ఫైనల్ చేరుకుంది. రెండో హీట్‌‌లో టర్కీ అథ్లెట్‌‌ ఐసెల్‌‌ ఒండెర్‌‌‌‌ 54.96 సెకన్లతో వరల్డ్ రికార్డుతో టాప్ ప్లేస్ సాధించింది.మంగళవారం రాత్రి ఫైనల్​ జరుగుతుంది.