చైనా చిత్తు.. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌

చైనా చిత్తు.. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌

బీజింగ్: ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌ నిలిచింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అతిథ్య చైనాపై 1-0 తేడాతో విజయం సాధించి.. వరుసగా రెండోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. తాజా విజయంతో మొత్తం ఐదుసార్లు ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ నెగ్గిన జట్టుగా హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ కో రికార్డ్ సృష్టించింది. కాగా, మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచులో అతిథ్య చైనా, భారత్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఇరు జట్లు పరస్పరం గోల్ పోస్టులపై దాడులు చేసుకోగా.. బలమైన డిఫెన్స్ కారణంగా మ్యాచ్ మొదలైన 50 నిమిషాల వరకు ఏ జట్టుకు గోల్ దక్కలేదు. 

Also Read:-లేడీస్ టీం అయినా.. జంట్స్ టీం అయినా ఒక్కటే

మ్యాచ్ 51వ నిమిషంలో భారత్‎కు తొలి గోల్ లభించింది. భారత స్టార్ డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ 51వ మినిట్‎లో అద్భుతమైన గోల్ చేసి.. ఇండియాను లీడ్‎లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్ కోసం చేసిన తీవ్ర ప్రయ్నతాలు విఫలం అయ్యాయి. దీంతో అతిథ్య చైనాను 1‌‌0 తేడాతో మట్టికరిపించి భారత్ ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా, ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‎లోనూ భారత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‎లో కాంస్య పతకం నెగ్గిన ఇండియా.. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలోనూ అదే దూకుడు ప్రదర్శించి విజేతగా నిలిచింది.