ఆసియా కప్ సూపర్-4లో భాగంగా మరికాసేపట్లో భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి మ్యాచ్ జరగబోతుంది. కొలొంబోలోని ప్రేమదాస్ స్టేడియం ఆతిధ్యమివ్వబోతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఏకంగా 5 మార్పులు చేయగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు తుది జట్టులో అవకాశం దక్కింది. తిలక్ వర్మకు ఇదే తొలి వన్డే కావడం విశేషం. మరోవైపు బంగ్లాదేశ్ జట్టులో తమిజ్ హాసన్ తొలి వన్డే ఆడనున్నాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ,రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ,మహ్మద్ షమీ
బంగ్లాదేశ్ తుది జట్టు: లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హాసన్ ( కెప్టెన్), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్
Also Read :- ఆసియా కప్ 2023 : గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ కెప్టెన్ బాబర్..