IND vs BAN 2024: బంగ్లాతో రెండో టెస్ట్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్

కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టు ఆడేందుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్  ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ గంట ఆలస్యం కావడంతో 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. 10:30 గంటలకు మొదలు కానుంది. పిచ్ పేస్ కు అనుకూలించనుండడంతో భారత్ మరోసారి ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతుంది. తొలి టెస్టు ఆడిన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

మరోవైపు బంగ్లాదేశ్ తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఫాస్ట్ బౌలర్లు నహిద్ రాణా.. తస్కిన్ అహ్మద్ స్థానంలో స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్, ఖలీద్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. రెండు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.          

భారత్ తుది జట్టు అంచనా:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్,జస్ప్రీత్ బుమ్రా

Also Read :- భారత్-బంగ్లా రెండో టెస్ట్

బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా:

షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్, హసన్ మహమూద్,  తైజుల్ ఇస్లాం,ఖలీద్ అహ్మద్