Cricket World Cup 2023: పాక్ సెమీస్‪కు వస్తే ముంబైలో ఆడదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

Cricket World Cup 2023: పాక్ సెమీస్‪కు వస్తే ముంబైలో ఆడదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీస్ కు చేరుతుందో లేదో కానీ ఒకవేళ సెమీస్ కు వస్తే టీమిండియాతోనే ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో  భారత్  నెదర్లాండ్స్ తో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ సేన అగ్ర స్థానంలోనే ఉంటుంది. మరో వైపు నాలుగో స్థానం కోసం పాకిస్థాన్ పోరాడుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడడటం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ కు చేరితే టాప్ లో ఉన్న టీమిండియాతోనే   ఆడాలి. అదే జరిగితే వరల్డ్ కప్ లో వేదిక మారబోతుంది. 

పాక్ సెమీస్ కు చేరితే షెడ్యూల్ ప్రకారం ముంబైలో భారత్ తో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా, ముంబై నగరంలో పాకిస్థాన్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని పీసీబీ.. బీసీసీఐకు అభ్యర్థన చేసింది. పాకిస్తాన్ అభ్యర్ధనను గౌరవించిన ICC, BCCI పాక్ సెమీస్ కు వస్తే ముంబైలో సెమీస్ ఆడదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఒక వేళ పాక్ సెమీస్ కు చేరితే భారత్ తో కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అప్పుడు మరో సెమీ ఫైనల్ ముంబైలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.  

also read : Cricket World Cup 2023: రాత్రి 8 గంటల నుంచి సెమీస్, ఫైనల్ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి 
 
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 న ముంబైలోని వాంఖడేలో మొదటి సెమీ ఫైనల్.. నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. టాప్ లో నిలిచిన జట్టు, నాలుగో స్థానంలో జట్టుపై మొదటి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అదే విధంగా రెండు, మూడు  స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిస్తే.. టాప్ లో ఉన్న భారత్ తో సెమీస్ ఆడేందుకు పాకిస్థాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.