వన్డే వరల్డ్ కప్ ఆడే.. టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..

వన్డే వరల్డ్ కప్ ఆడే.. టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..

 

దేశంలోని క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరల్డ్ కప్ జట్టు వచ్చేసింది. సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టుని ప్రకటించేశారు. ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకి వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ని ఎంపిక చేస్తారని భావించినా సెలక్టర్లు వీరిపై నమ్మకముంచలేదు. దాదాపు ఆసియా కప్ లో ప్రకటించిన జట్టునే ప్రకటిస్తూ ఎలాంటి సంచలన నిర్ణయాలకు చోటు ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించనుడగా.. హార్దిక్ పాండ్యకి  వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. 

అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్:

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఈ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్  న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో తలపడతాయి. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుండగా.. నవంబర్ 19 న ఫైనల్ తో 2023 వరల్డ్ విజేత ఎవరో తేలనుంది. ఇక అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 న జరగనుంది. వరల్డ్ కప్ ని భారత్ పూర్తిస్థాయిలో ఆతిధ్యమివ్వడం ఇదే తొలిసారి కాగా.. టీమిండియాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.  

       
 వరల్డ్ కప్ 15 మంది స్క్వాడ్ ఇదే:
 
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.