
న్యూఢిల్లీ : ఇండియా స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు ఊరట లభించింది. అతనిపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డిసిప్లినరీ ప్యానెల్ సోమవారం ఉపసంహరించుకుంది. మార్చిలో సెలక్షన్ ట్రయల్స్ తర్వాత డోప్ పరీక్ష కోసం తన శాంపిల్‌ను అందించడానికి నిరాకరించిన బజ్‌రంగ్‌పై నాడా వేటు వేసింది.
వరల్డ్ రెజ్లింగ్ బాడీ యూడబ్ల్యూడబ్ల్యూ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. నాడా నిర్ణయాన్ని బజ్‌రంగ్ తన లాయర్ల ద్వారా సవాల్ చేశాడు. శాంపిల్ ఇవ్వడానికి తానెప్పుడూ నిరాకరించలేదని డిసిప్లినరీ ప్యానెల్‌కు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశాడు. దాంతో ఛార్జ్ నోటీసు ఇచ్చే వరకూ సస్పెన్షన్‌ను నిలిపి వేస్తున్నట్టు నాడా తాజాగా ప్రకటించింది.