దుబాయ్ : ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఫిబ్రవరి)’ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), పాథుమ్ నిశాంక (శ్రీలంక)ను వెనక్కి నెట్టి అవార్డు గెలిచాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో యశస్వి 712 రన్స్ చేయడంతో ఈ అవార్డు దక్కింది. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో యశస్వి బ్యాటింగ్లో పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (12) కొట్టిన రికార్డును సమం చేయడంతో పాటు, అతి చిన్న వయసు (22 ఏళ్ల 49 రోజులు)లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు. ‘ఐసీసీ అవార్డు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని సాధిస్తానని ఆశిస్తున్నా. ఈ సిరీస్ను బాగా ఆస్వాదించా’ అని జైస్వాల్ వ్యాఖ్యానించాడు.