కెనడా ఓపెన్‌‌ క్వార్టర్స్‌‌లో గాయత్రి జోడీ

కెనడా ఓపెన్‌‌ క్వార్టర్స్‌‌లో గాయత్రి జోడీ

కల్గరీ (కెనడా): ఇండియా యంగ్‌‌ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కెనడా ఓపెన్‌‌లో క్వార్టర్‌‌ ఫైనల్‌ చేరారు.  గురువారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌ డబుల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఇండియా ద్వయం 17–21, 21–7, 21–8తో నటాషా (డెన్మార్క్‌‌)–టిర్టోసెంటోన్‌‌ (నెదర్లాండ్‌‌)పై గెలిచింది. 

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో ప్రియాన్షు రజావత్‌‌ 21–19, 21–11తో ఒబయాషి (జపాన్‌‌)పై నెగ్గాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో తన్యా హేమంత్‌‌ 11–21, 13–21తో బుసానన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో, అనుపమ 14–21, 21–17, 13–21తో మిచెల్లీ లీ (కెనడా) చేతిలో ఓడారు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో కృష్ణ ప్రసాద్‌‌–సాయి ప్రతీక్‌‌ జోడీ ఇంటిదారి పట్టింది.