దుబాయ్: అండర్19 ఆసియా కప్‌లో ఇండియా యంగ్ స్టర్స్ నిరాశ పరిచారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో పోరాడి ఓడిపోయారు. ఆదివారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 259/9 స్కోరు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ శరణన్ (60), సచిన్ ధాస్ (58) ఫిఫ్టీలతో మెరవగా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
దాంతో ఇండియా తక్కువ స్కోరుకే పరిమితం అయింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ జీషన్ నాలుగు వికెట్లతో చెలరేగగా ఆమిర్ హసన్, ఉబైద్ షా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో అజాన్ అవైస్ (105 నాటౌట్) సెంచరీతో దంచికొట్టడంతో పాక్ 47 ఓవర్లలోనే 263/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. షహజైబ్ ఖాన్ (63), కెప్టెన్ సాద్ బేగ్ (68 నాటౌట్) కూడా రాణించారు. ఇండియా బౌలర్లలో హైదరాబాదీ మురుగన్ అభిషేక్ రెండు వికెట్లు పడగొట్టాడు. మంగళవారం జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నేపాల్‌ల్‌పై గెలిస్తేనే ఇండియా నాకౌట్ చేరుతుంది.