
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటాను 256.8 మిలియన్ యూరోలకు (దాదాపు రూ.2,443 కోట్లు) కొనుగోలు చేయడానికి చర్చలు జరిపినట్లు ఫార్మా కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్ మంగళవారం తెలిపింది. కంపెనీ షేర్క్యాపిటల్లో 85.6 శాతం కొనడానికి పాయ్ పార్టనర్స్, యాంప్లిట్యూడ్ సర్జికల్ మేనేజ్‌మెంట్, ఇద్దరు మైనారిటీ వాటాదారులతో సంప్రదింపులు జరిపామని అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
యాంప్లిట్యూడ్ సర్జికల్ క్వాలిటీ, లోయర్-లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీల తయారీలో యూరోపియన్ మెడ్‌టెక్ లీడర్ అని పేర్కొంది. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన కీళ్ల స్థానంలో అమర్చడానికి మోకాలి, తుంటి ప్రొస్థెసెస్ను తయారు చేస్తుంది. జూన్ 30, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, యాంప్లిట్యూడ్ సర్జికల్ 106.0 మిలియన్ యూరోల అమ్మకాలను, 27.1 మిలియన్ యూరోల ఇబిటాను సాధించింది.