అస్త్రా మార్క్​-1 క్షిపణుల తయారీకి అనుమతి

అస్త్రా మార్క్​-1 క్షిపణుల తయారీకి అనుమతి

హైదరాబాద్​లో పర్యటించిన భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్​ ఎయిర్​ మార్షల్​ అశుతోష్​ దీక్షిత్​ అస్త్రా మార్క్​–1 క్షిపణులను తయారీ చేసేందుకు భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​కు అనుమతి ఇచ్చారు. దీంతో 200 అస్ర్తా మార్క్​–1 క్షిపణులను ఉత్పత్తి చేసేందుకు భారత వైమానిక దళం ఆమోదించింది. 

ఈ క్షిపణి గాలిలోనే శత్రువును హతమార్చుతుంది. దీనిని డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​ రూపొందించింది. వీటి ఉత్పత్తికి హైదరాబాద్​లోని భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​ ప్రొడక్షన్​ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది.  

     రూ.2,900 కోట్లతో అస్త్రా మార్క్​ 1 మిసైళ్ల డెవలప్​మెంట్ ప్రాజెక్టుకు 2022–23లోనే రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్​ ఆక్విజిషన్​ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అన్ని పరీక్షలు, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఉత్పత్తికి ఇప్పుడు ఆమోదం లభించింది. 
    రష్యాకు చెందిన సుఖోయ్​–30,  తేజస్​ల నుంచి శత్రు లక్ష్యాలపైకి ప్రయోగించగలిగేలా అస్త్రా మార్క్​ 1 మిస్సైళ్లు ఉంటాయి. 
    ప్రస్తుతం 130 కిలోమీటర్ల పరిధి గల అస్త్రా మార్క్​ 2 క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నది. 300 కిలోమీటర్ల స్ట్రైక్​ రేంజ్​తో సుదూర శ్రేణి అస్త్రా క్షిపణిని పరీక్షించి అభివృద్ధి చేసేందుకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.