ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై  చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీతంతో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీతానుభవ సర్టిఫికేట్​ తప్పనిసరిగా ఉండాలి. వయసు 2 జనవరి -2004 నుంచి 2 ఆగస్టు -2007 మధ్య జన్మించి ఉండాలి. పురుషులు 162 సెం.మీ; మహిళలు 152 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి.

సెలెక్షన్​: మ్యూజికల్‌‌ ఇన్‌‌స్ట్రుమెంట్స్‌‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌‌, ఇంగ్లీష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. 

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 22 నుంచి జూన్​ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌‌మెంట్ ర్యాలీ  జులై 3 నుంచి జులై 12 వరకు నిర్వహిస్తారు.  పూర్తి వివరాలకు www.agnipathvayu.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.