చెన్నై: చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబరు 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వైమానిక ప్రదర్శనలో రఫేల్, సు-30, మిగ్, జాగ్వార్, తేజస్ మొదలైన 72 రకాల విమానాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
హెలికాఫ్టర్‌ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు విన్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, తమిళనాడు మంత్రులు, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు
ALSO READ | మార్పు మొదలు.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై వినేష్ ఫొగట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్