మన దేశంలో విమానాలు ఎక్కేటోళ్లు పెరిగారు.. అయినా రూ.3 వేల కోట్ల లాస్​ వచ్చుడేందో..!

మన దేశంలో విమానాలు ఎక్కేటోళ్లు పెరిగారు.. అయినా రూ.3 వేల కోట్ల లాస్​ వచ్చుడేందో..!

న్యూఢిల్లీ: మన దేశ విమానయాన రంగంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు  రికార్డు స్థాయిలో ప్రయాణీకుల వృద్ధి ఉండగా, మరోవైపు నిరంతర ఆర్థిక సంక్షోభం వల్ల పరిశ్రమ మరిన్ని ఇబ్బందుల పాలవుతుందని ఎనలిస్టులు చెబుతు న్నారు. ఇక్రా రిపోర్ట్​ ప్రకారం, విమానయాన పరిశ్రమ 2025 ఆర్థిక సంవత్సరం,  2026  ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల చొప్పున నష్టపోవచ్చు. అయితే దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ సంవత్సరానికి 7--10 శాతం పెరుగుతుంది. 

2025 ఆర్థిక సంవత్సరంలో 164--–170 మిలియన్లకు చేరుకోవచ్చు. భారతీయ విమానాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు భారీగా పెరుగుతాయి. ప్రయాణికుల సంఖ్య15--–20 శాతం పెరుగుదలతో 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 34--36 మిలియన్ల మందికి చేరుకుంటుంది.2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (హెచ్​1) దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 7.93 కోట్ల మందికి చేరుకుంది.

ఇది వార్షికంగా 5.3 శాతం వృద్ధి చెందుతుంది. టికెట్ల ధరలు తక్కువగా ఉండటం ఈ పరిశ్రమకు ప్రధాన సమస్య అని ఎనలిస్టులు చెబుతున్నారు. కేంద్రం మాత్రం రైల్వే స్థాయిలో విమాన టికెట్ల ధరలను ఉంచాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు పదవీబాధ్యతలు స్వీకరించినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. 

ఖర్చులకు తగ్గ ఆదాయం లేదు..
పెరుగుతున్న కనెక్టివిటీ,  డిమాండ్ కారణంగా దేశీయ,  అంతర్జాతీయ విమాన ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఊహించిన పెరుగుదల ఉంటోంది. కానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ అధిక నిర్వహణ ఖర్చులు, తక్కువ టిక్కెట్ ధరలు,  సరఫరా గొలుసు కష్టాలు లాభదాయకతను దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఇక్రాలోని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కింజల్ షా మాట్లాడుతూ అధిక ఇంధన ధరలు, సరఫరా గొలుసు అంతరాయాలు  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ ఖర్చులను పెంచాయని, మార్జిన్లను మరింత తగ్గించాయని వివరించారు. 

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) వాటా మొత్తం ఖర్చులో40 శాతం వరకు ఉంటోంది. వీటి ధరలు సంవత్సరానికి 6.8శాతం తగ్గి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.96,192లకు చేరాయి. అయితే కోవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఉన్న స్థాయిల కంటే ఇది చాలా ఎక్కువే. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ లీజులు,  నిర్వహణ ఖర్చులకు డబ్బును డాలర్లలో చెల్లించాలి. డాలర్​ విలువ పెరుగుతుండటంతో క్యారియర్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది.   ఇండిగో సీఈఓ  పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ధరలు అతి తక్కువగా ఉన్న మార్కెట్లలో ఇండియా ఒకటని అన్నారు. ఇక్కడి మార్కెట్లో తీవ్ర పోటీ ఉందన్నారు. టికెట్ల ధరలు పెరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.