అమెరికాలో ఇండియాకు చెందిన ఐటీ ఉద్యోగి కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలో నివసిస్తున్న భారతీయ జంట , వారి ఇద్దరు పిల్లల్ని ఇంట్లో విగతజీవులుగా కనుగొన్నారు పోలీసులు. అయితే ఇద్దరు భానర్యభర్తలకు బుల్లెట్ గాయాలున్నట్లు గుర్తించారు. మృతులు ఆనంద్ సుజిత్ హెన్రీ(42), అతని భార్య ఆలీస్ ప్రియాంక(40) , వారి ఇద్దరు కవలపిల్లలుగా గుర్తించారు. ఆనంద్, ప్రియాంక కేరళకు చెందినవారు.వీరిది హత్యా, లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో ఇలాంటి అనుమానాస్పద సంఘటలను ఇటీవల కాలంలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన మంగళవారం (ఫిబ్రవరి 13) జరిగింది.
మృతులు ఆనంద్ సుజిత్, ప్రియాంక లు బుల్లెట్ గాయాలతో, వారి పిల్లలు ఇద్దరు పడగ గది విషాదకర రీతిలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు.. విచారణ చేస్తున్నాం. బాత్ రూమ్ లో గన్ షాట్ ల కారణంగా ఆనంద్, ప్రియాంక మరణించారు పోలీసులు చెబుతున్నారు. బాత్ రూమ్ లో లోడ్ చేసిన 9ఎంఎం పిస్టల్ కనుగొన్నామని శాన్ టియాగో పోలీసులు చెప్పారు.
ఆనంద్, ప్రియాంక భారతీయ, అమెరికన్ భార్యభర్తలు. ఆనంద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా అలీస్ ప్రియాంక సీనియర్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె రెండే ళ్ల క్రితం శాన్ మాటియో కౌంటీకి షిఫ్ట్ అయ్యారు.
ఈ సంఘటనతో అమెరికాలో వరుసగా భారతీయలు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు, వారు మృతిచెందిన దురదృష్ట కర సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
SMPD is conducting a death investigation on the 4100 block of Alameda de las Pulgas. Traffic is currently closed N/B Alameda de las Pulgas at 42nd Av, S/B Alameda de las Pulgas at Fernwood St, and W/B 41st Ave to Kelton Ct. Please avoid the area. https://t.co/ln5YNk2pRX pic.twitter.com/Gr9xlXhYP9
— San Mateo Police Department (@SanMateoPD) February 12, 2024