ఇండో అమెరికన్ వ్యాపారవేత్త, అవుట్‌కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షాకు బిగ్ షాక్ తగిలింది. రిషి షాకు యూఎస్ కోర్టు ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రూ. 8 వేల 300 కోట్ల కుంభకోణం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి థామస్ డర్కిన్ వెలువరించిన ఈ తీర్పు ఇటీవలి చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ మోసం కేసుల్లో ఒకటని అన్నారు. కంపెనీ లాభాల్లోఉందని చెప్పి .. రిష్ టాప్ ఇన్వెస్టర్లను మోసం చేశారు. యాడ్ల కోసం పలు కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుని బురిడీ కొట్టించారు.
బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం 2006లో కాంటెక్ట్స్ మీడియా హెల్త్ పేరిట షా ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఔట్ కమ్ హెల్త్ పేరిట మార్చాడు. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించేలా ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేయాలనేది అతని బిజినెస్ ప్లాన్. దీని ద్వారా వైద్య ప్రకటనలలో విప్లవాత్మక మార్పులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇందుకోసం డాక్టర్ల ఆఫీసుల్లో టీవీలను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచన నచ్చడంతో శ్రద్ధా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహ భాగస్వామిగా మారింది. 2010 తొలినాళ్ల నాటికి ఔట్ కమ్ హెల్త్.. వైద్య పెట్టుబడుల రంగంలో బడా సంస్థగా ఆవిర్భవించింది. దీంతో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఔట్ కమ్ హెల్త్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో షికాగోలో రిషి షా ఓ దిగ్గజంగా ఎదిగాడు. అయితే క్రమంగా బిజినెస్ దెబ్బతినడంతో షా, అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్డీ పెట్టుబడిదారులను మోసం చేయడం మొదలుపెట్టారు.